JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ఉధృతి పెరిగిందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించారని సూచించారు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.