E.G: రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ వాంబే గృహాల వద్ద జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో SKS ప్రసాద్, పీతల సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.