VZM: విజయనగరం పట్టణంలోని 42వ డివిజన్లో హరిత రాయబారులను జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో హరిత రాయబారులు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. వాళ్లకి పట్టణ ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం కూడా హరిత రాయబారులను ఆదుకోవాలన్నారు.