కృష్ణా: గుడివాడలోని పశువైద్యశాల భవనం పైకప్పుపెచ్చులు ఊడిపోయి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో విధులు నిర్వహిస్తున్నారు. పశువులకు వైద్యం చేయించడానికి వచ్చే రైతులు కూడా భవనం పరిస్థితి చూసి ఎప్పుడు తమ మీద పెచ్చులు పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.