NDL: ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్లో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టిఫిన్ రుచి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాల్లో ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని, అపరిశుభ్రతకు తావు ఇవ్వకూడదని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎప్పడు అందుబాటులో ఉండాలని తెలిపారు.