KMM: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తల్లాడ మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రామానుజవరం గ్రామంలోని పురాతన ముత్యాలమ్మ తల్లి గుడి వరద నీటిలో మునిగిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.