MHBD: సీరోలు మండలం చింతపల్లి శివారులోని పెద్ద లాల్ తండా -సీరోలు మార్గంలో ఉన్న మొండి వాగు, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదకర స్థితిలో వాగు ప్రవహిస్తుండటంతో, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అడ్డుపెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.