BPT: అద్దంకి పట్టణంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం ప్రతిజ్ఞ దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CPM మండల అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. నాడు బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో ముగ్గురు నాయకులు అమరులైనట్లు చెప్పారు. గత ప్రభుత్వం అమలు చేసిన స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం నేడు అదే విధాన్నాని అమలు చేస్తుందన్నారు.