MHBD: 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్రెడ్డిల త్యాగం అజరామరమని CPM జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ అన్నారు. గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. విద్యుత్ అమరుల స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలన్నారు.