KMR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై జిల్లా మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు చేరిన ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.