సత్యసాయి: ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను రిపోర్టర్లు కలిశారు. హిందూపురం జర్నలిస్ట్ రాజ్ గోపాల్ కాన్సర్ బారిన పడ్డ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ వంతు రూ.25వేలు ఆర్థికసాయం చేస్తున్నామని చెప్పగా మంత్రి స్పందించారు. తానూ మరో రూ.25వేలు ఇవ్వడంతో మొత్తం రూ.50వేలను బాధితుడికి అందజేశారు. అవసరమైతే వైద్య సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు.