ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లిని రెవిన్యూ గ్రామంగా మార్చుటకు కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్ హమిచ్చారు. గురువారం ఆదిలాబాదులోని ఆయన నివాసంలో గ్రామస్థులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీహనుమాన్ ఆలయానికి ప్రహరీ గోడ కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో చౌహన్ దిగంబర్, గుణవంతరావు, శ్యామరావు, కేశవ్, దీపక్ పాల్గొన్నారు.