JN: చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెం గ్రామంలో గురువారం విద్యుత్ అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి త్యాగాలను సీపీఎం నేతలు స్మరించుకుంటూ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యుడు సాదం శ్రీనివాస్, బిక్షపతి, శ్రీనివాస్ పాల్గొని అమరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఉచిత కరెంట్ అమలు వెనుక విద్యుత్ అమరుల త్యాగాలను గుర్తుచేశారు.