VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో వినాయక మండపాలు నిర్వహించేవారు నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ షణ్ముఖరావు గురువారం తెలిపారు. వర్షాల కారణంగా చెరువులన్నీ పూర్తిగా నిండీ ఉన్నందున ఈతరాని వారు దిగొద్ధని, ఏదైనా సంఘటనలు జరిగితే కమిటీ సభ్యులు బాధ్యత వహించాలని సూచించారు. చెరువుల వద్ద స్థానిక పంచాయతీ సిబ్బందిచే లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.