PDPL: ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రామగుండంఎమ్మెల్యే రాజాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు కోరుకున్నారు. గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణనాథుని సన్నిధిలో కుటుంబ సభ్యులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని ఆది దేవుడిని కోరుకున్నారు.