BDK: లక్ష్మీదేవి పల్లి మండలం వేపలగడ్డ గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ చంద్రపై అధికారులు చర్యలు తీసుకోవాలని సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్ డిమాండ్ గురువారం చేశారు. వేపలగడ్డ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్ర గత 45 రోజులుగా విధులు హాజరుకాకుండా గైర్హాజరు అవుతున్నారని ఆరోపించారు.