TG: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, సంభవించిన వరదలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు.. శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.