VKB: కోట్పల్లి మండలంలో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో పత్తి, పెసలు వంటి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పంట నష్టం తప్పదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.