TG: వరదలపై 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు DGP జితేందర్ రెడ్డి తెలిపారు. ‘వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండి, రెస్క్యూ ఆపరేషన్లు చేస్తోంది. కామారెడ్డి, నిర్మల్, మెదక్, రామాయంపేటలో వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు 1200 మందిని కాపాడాం. కామారెడ్డి జిల్లాలో చాలామందిని రక్షించగలిగాం. సకాలంలో SDRF టీమ్స్ చేరుకోవటంతో భారీ ముప్పు తప్పింది’ అని చెప్పారు.