TG: భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు ప్రకటించింది. ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల చెరువులు తెగిపోవడంతో వరద నీరు గ్రామాలలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.