AP: ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు ఉండనున్నాయి. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థ సిద్ధం చేయాలని సూచించారు.