SKLM: సరుబుజ్జిలి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం పలు గ్రామాల్లో ఎస్సై హైమావతి తన సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి, మద్యం అక్రమ నిల్వలు కనుగొనేందుకు, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లల్లో, పలు దుకాణాలు, షాప్ లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో సరైన వాహన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.