KRNL: విద్యుత్ అమరవీరుల పోరాటం వృథా కానివ్వబోమని సీపీఐ మండల నాయకులు కృష్ణ, రాజు, శేషు పేర్కొన్నారు. ఇవాళ కోడుమూరు పాత బస్టాండ్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమ అమరుల జ్ఞాపకార్థం ప్రతిజ్ఞ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 2000 ఆగస్టు 28న బషీరాబాగ్ కాల్పుల్లో మరణించిన ఉద్యమ పోరాట యోధులును స్పూర్తిగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.