TG: HYD గోషామహల్‌లోని హబీబ్‌నగర్‌లో సీఎం రేవంత్ ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వివాదాస్పదంగా మారింది. దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సౌత్ వెస్ట్ డీసీపీ మండపాన్ని సందర్శించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి, మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.