VKB: కోట్పల్లి మండలం అన్నసాగర్, నాగసముందర్ గేట్ మధ్య ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు గుంతల్లో నీరు నిండిపోవడంతో గుంత లోతు తెలియక వాహనదారులు కింద పడుతున్నారని వారు వాపోయారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.