E.G: వినాయక చవితిని పురష్కరించుకుని రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శానిటేషన్ సిబ్బంది భక్తుల నుంచి విగ్రహాలను, పత్రిని వేరువేరుగా సేకరించి గోదావరి కలుషితం కాకుండా చేస్తున్నారు. గురువారం గమనించిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.