ఎన్టీఆర్: జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత, ఉన్నతాధికారులు సమీక్షించారని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బుడమేరు వద్ద 3,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా, పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. మున్నేరుకు ఖమ్మం, వరంగల్ వర్షాలతో నీరు వచ్చిందని, ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరిక జారీకి సిద్ధమని తెలిపారు.