GNTR: తుళ్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్ తమ కార్యవర్గం సమన్వయంతో పనిచేసి సొసైటీలో డిపాజిట్లు పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సొసైటీ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆయన ఆరోపించారు. తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.