KMM: అశ్వాపురం మండలంలో గురువారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. ముందుగా మల్లెల మడుగు గ్రామంలో నిర్మించిన నూతన సీతారామ చంద్ర స్వామి ఆలయంను సందర్శించారు. ఆలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.