MBNR: జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని గురువారం పట్టణ కేంద్రంలో యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా పని చేసే విలేకరుల వృత్తి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ, ఉపాధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి సుల్తాన్, పాల్గొన్నారు.