CTR: పెళ్లకూరు మండలం చావాలి వద్ద ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి నుండి నాయుడుపేటకు వెళుతుండగా మండలంలోని చావాలి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో అతని చెయ్యి విరిగినట్లు సమాచారం. ఈ మేరకు స్థానికులు 108కు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని నాయుడుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.