NRPT: రైతులకు సరిపడా యూరియా మద్దూరు మండలంలో అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవలసిన పనిలేదని వ్యవసాయ శాఖ అధికారి రామ కృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ధమగ్నాపూర్ సహకార సంఘంలో 400 బస్తాలు, ప్రైవేటు ఫర్టిలైజర్స్ షాపుల్లో 600 బస్తాల యూరియాను పంపిణీ చేశామని తెలిపారు. రెండు రోజుల్లో మరో వెయ్యి నుండి 2000 బస్తాలు అందుబాటులోకి వస్తాయన్నారు.