NLG: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్‌లోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయిలో పలు అభివృద్ధి పనులు, కార్యచరణపై తహసీల్దార్లు, ఎంపీడీవోలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సహకరించాలన్నారు.