MDK: భారీ వర్షాల కారణంగా మెదక్-అక్కన్నపేట్ మధ్య రెండు చోట్ల రైల్వే ట్రాక్ ధ్వంసమయింది. ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ట్రాక్ ధ్వంసం కావడంతో నిన్నటి నుంచి మెదక్-కాచిగూడ రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సాయంత్రం వరకు పునరుద్ధరించే అవకాశం ఉందని మెదక్ స్టేషన్ మాస్టర్ పద్మారావు తెలిపారు.