ELR: అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరులకు ఇవాళ వేలేరుపాడు అంబేద్కర్ కూడలిలో నివాళులర్పించారు. కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, కామ్రేడ్ బాలస్వామికి జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.