KNR: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం కరీంనగర్ MLA గంగుల కమలాకర్ కవ్వంపల్లిని పరామర్శించారు. రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్సీ నారదాసు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.