GDWL: ఉండవెల్లి మండలం ఆలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల దుస్థితిపై గురువారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య తీవ్రంగా మండిపడ్డారు. గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే అధికారులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతగాని పాలనకు నిదర్శనమని విమర్శించారు.