ప్రకాశం: పొదిలి మండలం కంభాలపాడులో నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గణేశ్ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేశారు. నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం వేశారు. ఈ వేలంలో రూ. 20వేలకు చరరాశి నారాయణ, గంధం మస్తాన్ నాయుడు లడ్డూను దక్కించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి వినాయకుడిని తరలించారు.