BDK: మణుగూరు మండలం బీటీపీఎస్ ప్రాంతంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పర్యటించారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ.. విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలు చేపల వేటకి వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.