KNR: గంభీరావుపేట మండలం నర్మాల వద్ద గల్లంతైన వ్యక్తి మృతదేహం తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ వద్ద కనిపించిందనే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అసత్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం తెలిపారు. మానేరు నది పరిధిలోని గ్రామాలను అధికారులు పరిశీలించగా ఎక్కడా మృతదేహం లభ్యంకాలేదని తెలిపారు. ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దన్నారు.