KRNL: ఆదోని పట్టణం ప్రభుత్వ (ఏరియా) ఆసుపత్రిని, ఇందిరా నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని వివిధ విషయాలపై ఆరా తీశారు. ప్రజలకు వైద్య సేవ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.