కృష్ణా: ఎస్పీ గంగాధరరావు గురువారం పెడనలోని గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గత సంవత్సరం జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.