VZM: పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మనాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ పెట్టుబడులు పెరిగినప్పటికీ గిట్టుబాటు ధరలు పెరగడం లేదని, గిట్టుబాటు ధరలు పెంచి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.