GDWL: వడ్డేపల్లి మండలం, జూలకల్ గ్రామానికి చెందిన గర్భిణి మైత్రికి గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. మానోపాడ్ 108 వాహనం గ్రామానికి చేరుకుని ఆమెను వడ్డేపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా, నొప్పులు ఎక్కువయ్యాయి. మార్గమధ్యంలోనే 108 టెక్నీషియన్ కల్పన సురక్షితంగా ప్రసవం చేయించారు.