RR: చౌదరిగూడ మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ త్వరలో సహకారం కానుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, సీఎం, డీప్యూటీ సీఎం చొరవతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బీఆర్ఎస్ పార్టీని నిలదీస్తామన్నారు.