NLG: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేతేపల్లి మండలం గుడివాడ గ్రామ చెరువు అలుగు పోస్తుంది. ఈ సందర్భంగా గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గంగమ్మకు కొబ్బరికాయ కొట్టి ప్రతేక్య పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.