SKLM: పలాస రైల్వే స్టేషన్ పరిధిలో బండిపేట సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు GRP హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 9492250069 నెంబర్ని సంప్రదించాలి లేదా GRP పలాస స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు.