NLG: చిట్యాల పురపాలిక పరిధిలోని ఒకటవ వార్డు శివనేని గూడెం చెరువును నీటిపారుదల శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. తూములు లీకేజీ అవుతున్నట్లు మత్స్య పారిశ్రామిక సంఘం ఛైర్మన్ నూతి సైదులు ఎమ్మెల్యే వేముల దృష్టికి తీసుకెళ్ళగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీఈ సునీత, ఏఈ సంతోష్ విచ్చేసి పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.