KMM: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి సత్తుపల్లి మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ మేరకు గురువారం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించారు. మున్సిపాలిటీలోని వేంసూరు రోడ్, కాకర్లపల్లి రోడ్, సిద్దారం రోడ్, తామర చెరువు ప్రాంతాల్లో నీటి వరదను పరిశీలించారు. జోరు వానలో అధికారులను అప్రమత్తం చేసి సూచనలు చేశారు.