E.G: నిడదవోలులో గణేష్ నిమజ్జన ప్రాంతాలను కొవ్వూరు డీఎస్పీ పి.దేవకూమార్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. వర్షాలు కారణంగా గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నందున నిమజ్జన ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలంతా నిమజ్జనం సమయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. నిడదవోలు, సమిశ్రగూడెం ఎస్ఐలు జగన్ మోహన్, సుందర్ బాలాజీ ఉన్నారు.